ఈ మధ్య ఒక హీరో కు రాసిన కథ మరోక హీరో చేయడం కామన్ అయిపొయింది. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి , హీరో రామ్ కోసం కథ రాసాడు..కానీ అతడు నో చెప్పేసరికి అది కాస్త రవితేజ చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ కోసం కథ రాసిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్ నో చెప్పడం తో బన్నీ తో చేయబోతున్నాడు. ఇలా ఒకరి కథలు మరొకరు చేస్తూ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు.
తాజాగా కళ్యాణ్ రామ్ కూడా అలాంటి కథనే చేయబోతున్నాడు. శ్రీను వైట్ల , అనిల్ రావిపూడి దగ్గర పనిచేసిన ఉపేంద్ర అనే కొత్త డైరెక్టర్ సునీల్ కోసం ఓ కథ రెడీ చేసాడు. కానీ ఇటీవల సునీల్ మార్కెట్ పూర్తిగా పడిపోవడం తో సునీల్ తో సినిమా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఉపేంద్ర రాసిన కథ కథలాగానే ఉండిపోతుంది. దీంతో సునీల్ ని నమ్ముకుంటే ఎప్పటికి డైరెక్టర్ ను కాలేనని అనుకున్న ఉపేంద్ర , ఆ కథను కళ్యాణ్ రామ్ కు వినిపించాడట. కథ నచ్చడం తో వెంటనే అతడితో సినిమా చేయడానికి ఒకే చెప్పాడట.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై ఈ మూవీ ని తానే నిర్మిస్తానని హామీ ఇచ్చాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ ఫైకి వెళ్లనుందని సమాచారం.