రివ్యూ : ఘాజీ – ఇది భారత దేశానికి ఇచ్చే గౌరవం.

టైటిల్ : ‘ఘాజీ’ (2017)
స్టార్ కాస్ట్ : రానా , కె.కె.మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సి, ఓంపురి, నాజర్‌ తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సంకల్ప్‌
నిర్మాతలు: పివిపి సినిమా, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్
మ్యూజిక్ : కె(కృష్ణ కుమార్)
విడుదల తేది : ఫిబ్రవరి 17, 2017
తెలుగు మిర్చి రేటింగ్ : 4/5

గమనించగలరు : చిత్ర యూనిట్ ప్రదర్శించిన ప్రీమియర్ షో ద్వారా రివ్యూ ఇవ్వబడినది.

రివ్యూ : ఘాజీ – ఇది భారత దేశానికి ఇచ్చే గౌరవం.

Ghazi-telugu-review

ఎప్పుడు మూస కథలతోనే సినిమాలు తీస్తారని మన తెలుగు ఇండస్ట్రీ కి ఓ పేరు ఉంది..కానీ ఈ మధ్య కాలం లో టాలీవుడ్ మూస చిత్రాల నుండి బయటపడుతు, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ సక్సెస్ అవుతున్నారు..ఈ మధ్య అలాంటి చిత్రాలే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాత్మక విజయాలు సాధిస్తున్నాయి. 1971లో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య సముద్రంపు అడుగున జరిగిన యుద్ధమే ఘాజీ..ఈ యుద్ధం జరిగిందని చాల మంది కి తెలియదు. అందుకే అప్పుడు జరిగిన యుద్దాన్ని కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు సంకల్ప్..మరి ఆ యుద్ధం ఎలా జరిగింది..ఎవరు గెలిచారు..అసలు ఆ యుద్దానికి ఘాజీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కథ :

1971 లో భారతీయ నేవీ ని మట్టు పెట్టాలని చూసిన పాకిస్థాన్ , భార‌త నేవీకు సంబంధించిన ఐ.ఎన్‌.ఎస్‌.విక్రాంత్‌ను నాశనం టార్గెట్ చేయడానికి , విశాఖ ఓడ‌రేవును ధ్వంసం చేయాలనీ ప్లాన్ చేస్తుంది. దీనిని పసిగట్టిన భారత నేవీ, భార‌త స‌ముద్ర జలాల్లోకి ఎస్‌21 అనే సబ్ మెరైన్‌ను నియ‌మిస్తుంది. ఈ స‌బ్‌మెరైన్‌కు ర‌ణ్ విజ‌య్ సింగ్‌(కె.కె.మీన‌న్‌) కెప్టెన్‌ గా వ్యవహరించగా , ర‌ణ్ విజ‌య్ సింగ్ ఆవేశాన్ని కంట్రోల్ చేయ‌డానికి తోడుగా క‌మాండ‌ర్ అర్జున్ వ‌ర్మ‌(రానా ద‌గ్గుబాటి)ని ప్ర‌భుత్వం పంపుతుంది. అయితే పాకిస్థాన్ పంపిన ఘాజీ స‌బ్‌మెరైన్ భార‌త్ మెరైన్స్ క‌న్నా ఎన్నో రెట్లు బ‌లమైన‌ది. అలాంటి పాకిస్థాన్ స‌బ్‌మెరైన్ భారత నేవీ ఎలా ఎదురుకుంది..? ర‌ణ్ విజ‌య్ సింగ్‌, క‌మాండ‌ర్ అర్జున్ వ‌ర్మ‌ లు ఎలా పోరాడారు..? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేది మీరు తెరఫై చూడాల్సిందే..

ప్లస్ :

* స్టోరీ

* స్క్రీన్ ప్లే – డైరెక్షన్

* నటి నటుల పెర్ఫార్మన్స్

మైనస్ :

* అక్కడక్కడ తెలుగు డబ్బింగ్

* కొన్ని యాక్షన్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ముందుగా కె.కె.మీన‌న్‌ గురించి చెప్పుకోవాలి కెప్టెన్ ర‌ణ్ విజ‌య్ సింగ్‌ ఎస్ 21 గా అతడు చేసిన యాక్టింగ్ సినిమాకు ప్రాణం పోసింది..ఆవేశ పరుడైన విజయ్..యుద్ధ సమయాల్లో అవతలివారిని ఎలా మట్టు కల్పించాలో..ఎత్తుకు ఫై ఎత్తు వేస్తూ కనిపిస్తూ స్క్రీన్ ఫై ఆసక్తి కనపరిచాడు. ఇంకాస్త ఇతని రోల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది..ఇక ర‌ణ్ విజ‌య్ సింగ్‌ ఆవేశాన్ని కంట్రోల్ చేయ‌డానికి తోడుగా క‌మాండ‌ర్ అర్జున్ వ‌ర్మ‌ రోల్ లో రానా అద్భుతమైన నటనను కనపరిచి , మరోసారి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు..ముందు నుండి ఈ సినిమా ఫై ఎందుకు రానా అంత మక్కువ చూపించాడో సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది.

ఇక అనన్య రోల్ లో తాప్సి నటించినప్పటికీ , ఆమె పాత్ర కు పెద్ద స్కోప్ లేకుండా పోయింది. ఒకానొక టైంలో ఆమెను ఎందుకు తీసుకున్నారో కూడా అర్ధం కాలేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవరాజ్ రోల్ అతుల్ కుల‌క‌ర్ణి ఆకట్టుకున్నాడు. నాజ‌ర్‌, ఓంపురి, రాహుల్ సింగ్‌, స‌త్య‌దేవ్‌, ర‌వి వ‌ర్మ‌, ప్రియ‌దర్శి వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు..మూవీ లో నటించిన వారంతా వెండి తెర ఫై కనిపించడం కాదు , వారి పాత్రలకు ప్రాణం పోసారని చెప్పాలి.

ghazi-pic2

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు సంకల్ప్ గురించి చెప్పుకోవాలి..ప్రేమకథలు , యాక్షన్ కథలను వెండి తెర ఫై అయిదు పాటలు , ఒక ఐటెం సాంగ్ , నాల్గు కామెడీలతో ఎవరైనా తీసి సక్సెస్ అవుతారు. కానీ కొంతమంది కే తెలిసిన వాస్తవిక కథను..అది కూడా దేశానికి సంబదించిన కథను అందరికి తెలిసేలా, కళ్లకు కట్టేలా చూపించడం అనేది చాల గ్రేట్..ఇప్పుడు సంకల్ప్ చేసింది కూడా అదే. 1971 లో ఇండియా – పాకిస్థాన్ ల మధ్య సముద్రపు అడుగున జరిగిన ఓ యుద్దాన్ని , వెండి తెర ఫై చూపించి సక్సెస్ అయ్యాడు. రెండున్నర గంటల సేపు కేవలం నేవీ లో జరిగే పోరాటం..క్షణం క్షణం ఏం జరుగుతుందో..శత్రువులు ఏ వైపు నుండి దాడి చేస్తారో అంటూ ఆసక్తిగా ప్రేక్షకుడు చూసే విధంగా సినిమాను తెరకెక్కించి నూటికి నూరు మార్కులు వేసుకున్నాడు.

అతడికి ఇది మొదటి సినిమానే అయినా కానీ ఇలాంటి కథ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం అనేది నిజంగా ఒక భారతీయుడిగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..ఎక్కడ కూడా ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ రాకుండా చక్కటి స్క్రీన్ ప్లే తో పాటు కథను ముందుకు తీసుకెళ్లడం , కథను బట్టి నటులను ఎంచుకొని ప్రతి ఒక్కరు సినిమాను చూసి ఏం తీసాడురా..అనుకునే విధంగా సినిమాను తెరకెక్కించాడు.

మది కెమెరా పనితనం కూడా సినిమాకు వెన్నులా నిలిచింది..విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా, చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో సినిమాను మొత్తం చూపిస్తూ , చూసే వారికీ నిజంగా మనం సముద్రంలోనే ఉన్నాం అనుకునేలా తన కెమెరాని పరుగులు పెట్టించాడు. ఇతడి కెమెరాపనితనం గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది.

కె(కృష్ణ కుమార్) సంగీతం కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది.. సినిమా ప్రతి ఫ్రేమ్ లో తన నేపధ్యసంగీతం ఆకట్టుకుంది. యుద్ధం జరిగేటప్పుడు కానీ , కథ సాగుతున్న సమయం లో కానీ అతడి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ ఎడిటింగ్ కూడా సినిమాను స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లగలిగింది..ఇలాంటి కథతో సాగే చిత్రానికి ఎడిటింగ్ అనేది చాల ముఖ్యం. ఒకే దానిపై రెండున్నర గంటలు సినిమా నడవాలంటే ఎడిటర్ పాత్ర చాల ముఖ్యం..ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ తన పనితనాన్ని చాటుకున్నాడు.

తెలుగు వర్షన్ కు సంబదించిన డైలాగ్స్ ను గుణ్ణం గంగ‌రాజు రాయడం జరిగింది..కథకు తగ్గ మాటలు అందించాడు కాకపోతే కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కాలేదు. అయినాగానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

ఇక చివరగా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి..భారీ చిత్రాలను తీయడం లో పీవీపీ తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీ లో అందరూ చెప్పుకుంటారు..చాలామంది నిర్మాతలు లాభం కోసం సినిమా తీస్తే, ఇతను మాత్రం ప్రేక్షకులకు కొత్తదనం అందించాలని సినిమాలు నిర్మిస్తాడు. ఇప్పుడు ఘాజీ చిత్రం కూడా అదే..ఇలాంటి కథను భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయాలంటే ముందుకు ధైర్యం ఉండాలి..పీవీపీ సినిమా & మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫై ఈ మూవీ ని నిర్మించారు..తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాను ఎంతో బాగా నిర్మించి సక్సెస్ అయ్యారు.

చివరిగా :

తెలిసిన కథనే మళ్లీ మళ్లీ చూసి విసిగిపోయిన సినీ జనాలకు , ఈ ఘాజీ చిత్రం కొత్త అనుభూతిని కల్గిస్తుంది. పాకిస్థాన్ – ఇండియా మధ్య యుద్దాలంటే కాశ్మీర్ లోనే జరుగుతాయని అందరికి తెలుసు..కానీ ఎవరికీ తెలియకుండా సముద్రం లో కూడా ఓ యుద్ధం జరిగిందని అదే ఘాజీ యుద్ధం అని అందరికి తెలియజేసాడు దర్శకుడు సంకల్ప్..సరిహద్దు భద్రత కోసం సైనికులు యుద్ధాల్లో పోరాడి సాధించిన విజయాలను , ఎప్పటికి మరిచిపోవద్దని వారిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని తెలియజేసింది ఈ చిత్రం..ఓవరాల్ గా ఘాజీ – ఇది భారత దేశానికి ఇచ్చే గౌరవం.