‘తుపాకి’ ఎలా పేలుతుందో?

మురుగదాస్ సినిమా ‘తుపాకి’ ఈ నెల 13న విడుదల కానుంది. విజయ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. విజయ్ కి తెలుగులో అసలేమాత్రం మార్కెట్ లేకపోయినా… తెలుగు హక్కులను దాదాపు రూ.12 కోట్లు పోసి కొన్నారు. కారణం… ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు కావడమే. ‘గజినీ’ సినిమాతో తన స్టామినా నిరూపించుకున్న మురుగాదాస్ ‘సెవెంత్ సెన్స్’ సినిమాతో దారుణంగా బోల్తా పడ్డాడు. అ సినిమా సాధారణ ప్రేక్షకులకు చేరకపోయినా, విమర్శకులకు మాత్రం నచ్చింది. తన తప్పు తెలుసుకున్న ఈ దర్శకుడు… ఈసారి కమర్షియల్ హిట్ చేజిక్కించుకోవాలనే తపనతో పనిచేసాడట. యాక్షన్ నేపద్యంలో సాగే ఈ సినిమాకి సెన్సార్ ఒక్క కట్ కుడా చెప్పకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే తమిళంలో ఉన్నంత క్రేజ్ ఈ సినిమాకి తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. బిజినెస్ కూడా కాలేదు. దాంతో నిర్మాతలే సొంతంగా ఈ సినిమాని విడుదల చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. మురుగదాస్ మరోసారి మాయ చేస్తే… ‘తుపాకి’ నిర్మాతలకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం. మరి ఎం జరుగుతుందో చూడాలి.