ఖైదీ ఫస్ట్ డే యూఎస్ కలెక్షన్స్…

khaidi-premire-talk

‘ బాస్ ఇస్ బ్యాక్ ‘ అంటూ మెగా స్టార్ చిరంజీవి మాములుగా రాలేదు..ఖైదీ నెం 150 మూవీ ఫై అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు రెట్టింపు చేసింది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ తో మొదటి రోజు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసాడు. 9 ఏళ్ల తర్వాత కూడా చిరంజీవి లో ఏ మాత్రం జోరు , స్టయిల్ , డాన్స్ , ఫైట్స్ , కామెడీ ఇలా ఒక్కటే ఏంటి అన్నిట్లోనూ మెగాస్టార్ అనిపించుకున్నాడు.

chiru

ఒక ఓవర్సీస్ లో అయితే మెగా కుమ్ముడూ మాములుగా లేదు..ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రం చేయలేని వసూళ్లు ను ఖైదీ కలెక్ట్ చేసిందని ప్రముఖ బాలీవుడ్‌ ట్రెడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపాడు.అమెరికాలో మంగళవారమే విడుదలైన ఈ సినిమా 12 లక్షల 51 వేల 548 డాలర్లు (రూ. 8.56 కోట్లు) వసూలు చేసిందని ఆయన వెల్లడించారు. మిడ్‌వీక్‌లో విడుదలైనప్పటికీ ఈ సినిమా అమెరికాలో అద్భుతమైన ఓపెనింగ్స్‌ సాధించిందని తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా వసూళ్లు చేస్తుందని అందరూ అంచనాలే వేస్తున్నారు.