ప్రీమియర్ షో హైలైట్స్ : ఖైదీ నెం 150

khaidi-premire-talk

మెగాస్టార్ నటించిన ఖైదీ నెం 150 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే చాల చోట్ల ప్రీమియర్ షోస్ వేయడం తో మెగా సందడి మొదలయ్యింది..కొద్దీ సేపటి క్రితమే ప్రీమియర్ షో పూర్తి అయ్యింది ..సినిమా చూసిన మెగా బిమానుల ఆనందాలు చెప్పలేం..9 ఏళ్ల తర్వాత బాస్ ఇస్ బ్యాక్ అంటూ చిరు ఫుల్ భోజనం పెట్టాడు. ఎలాంటి సినిమా అయితే బాస్ కు గ్రాండ్ ఎంట్రీ అవుతుందో అలాంటిదే చేసి విజయం సాధించడం కాదు అభిమానులు పెట్టుకున్న అంచనాలకు సక్సెస్ అయ్యాడు.

ఇక ప్రీమియర్ షో టాక్ విషయానికి వస్తే : మెగాస్టార్ చిరంజీవి ఖైదీగా సూపర్ ఎంట్రీ ఇస్తాడు…అప్పుడు థియేటర్ అంత మెగా స్టార్ జిందాబాద్ ..బాసు..అన్న చిరంజీవి అంటూ ఈలలతో మారుమోగిపోయింది..జైలు సిబ్బంది తో చిరు మాట్లాడే సన్నివేశాల దగ్గర నుండి సినిమా ముందుకు సాగిస్తుంది..ఆ తర్వాత రత్తాలు సాంగ్ చించేసాడు..దేవి మాస్ ట్యూన్స్ కు బాస్ మాస్ స్టెప్స్ అదరగోట్టాయి..

chiru

* కాజల్ ఎంట్రీ ఇవ్వడం , మెగాస్టార్ డ్యూయల్‌ రోల్‌లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది..మెగాస్టార్ ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ శీను..ఆలా ఆలా కథ ముందుకు సాగుతుంది… అదిరిపోయే ఫైట్, డైలాగ్‌తో ఇంటర్వెల్ ట్వీస్ట్ ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ ఫై మరింత ఆసక్తి పెరిగేలా ఉంది…

* ఇంటర్వెల్ తర్వాత పోసాని ఎంట్రీతో కామెడీ సూపర్బ్..

* మెగా బ్రదర్ నాగబాబు ఓ జడ్జిగా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు..బాబు తో పాటు వీవీ వినాయక్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు..గతం లో ఠాగూర్ చిత్రం లో కూడా వినాయక్ కనిపించడం మనం చూసాం.

* అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ అంటూ చిరు స్టెప్స్ తో జత కట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇద్దరినీ ఆలా ఒకే ఫ్రెమ్ లో చూసిన అభిమానుల సంబరాలు మాములుగా లేవు..

* రైతుల గురించి చిరంజీవి ఇచ్చే స్పీచ్ చాలామందిని ఆలోచించేలా ఉంటుంది.

* ఓవరాల్ గా ఖైదీ అందరికి గుర్తుండి పోయే చిత్రంగా నిలిచిపోతుంది…చిరు కెరియర్ లో ఇంద్ర , ఠాగూర్ వంటి చిత్రాలు ఎలాగో ఖైదీ నెం 150 కూడా గొప్పగా చెప్పుకొనే చిత్రం..అభిమానులకే కాదు అందరికి నచ్చే ఖైదీ..పూర్తి రివ్యూ మరికొద్ది నిమిషాల్లో లైవ్ కాబోతుంది..అప్పటివరకు ఈ లింక్ క్లిక్ చేస్తూనే ఉండండి..ప్రివ్యూ : ఖైదీ నెం 150