‘ఖబడ్దార్‌’ అన్న డైరెక్టర్ తోనే చిరు నెక్స్ట్ మూవీనా..?

chiru

మెగా స్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెం 150 తో ఈ సంక్రాంతి కీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇంత గ్యాప్ తర్వాత చిరు వస్తుండడం తో మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి..దానికి తగట్టే సినిమా ఆడియో , డాన్స్ , ఫైట్స్ , కంటెంట్ , కామెడీ , సెంటిమెంట్ ఇలా అన్ని సమపాలనలో ఉండేలా సినిమా ని తెరకెక్కించాడు డైరెక్టర్ వినాయక్..

ఇక ఈ మూవీ తో పాటు బాలకృష్ణ నటించిన 100 వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి ‘ కూడా ఒక్క రోజు గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ఫై కూడా భారీ అంచనాలే ఉన్నాయి..తెలుగు చక్రవర్తి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా డైరెక్టర్ ఈ మూవీ ని ఎంతో ప్రతిషాత్మకంగా రూపొందించాడు..ట్రైలర్స్ , గ్రాఫిక్స్ తో సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఇక ఈ మూవీ ప్రచార కార్య క్రమాలలో క్రిష్ నోరు జారీ ‘ఖబడ్దార్‌’ అంటూ టంగ్‌ స్లిప్‌ అయ్యాడు..తను ఖబడ్దార్‌ అన్నది చిరంజీవినే అంటూ మీడియాతో పాటు చిరు అభిమానులు కూడా ఆరోపించే సరికి తాను చిరంజీవిని ఛాలెంజ్‌ చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

krish-khabardar

కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆ మాటనే పట్టుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యం లో చిరు నెక్స్ట్ మూవీ క్రిష్ తోనే ఉండబోతుందని ప్రచారం జరగడం తో , ఖబడ్దార్‌ అన్న డైరెక్టర్ తో మెగా స్టార్ చేయడం ఏంటి అని గట్టిగా ఫ్యాన్స్ అంటున్నారు..అంతే కాదు చరణ్ కు ఈ విషయమై చాలామంది ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ఫోన్లు చేసి అడగడం మొదలు పెట్టారట..మరి ఇది ఎంత వరకు నిజం అనేది..అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో తెలియాలి.