ఖైదీ కి అడుగడుగునా ఘన స్వాగతం..

chiru-at-vyd

మెగా ఖైదీ ఫంక్షన్ మరికొద్ది సేపట్లో మొదలు కానుంది..ఈ ఫంక్షన్ ఫై మెగా అభిమానులే కాదు ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది..ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి విజయవాడ కు చేరుకున్నాడు..చిరు కు ఘన స్వాగతం పలుకుతూ అభిమానులు హెరెత్తించారు..ఇక అభిమానుల ఉత్సహం చూసిన చిరు తన కార్ నుండి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసాడు.

chirnjeevi-prerelease

హాయిలాండ్‌ వేదిక ను పోలీసులు కట్టుదిట్టం చేసారు..లక్షలాది అభిమానులు తరలి రావడం తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతో పాటు చిత్ర యూనిట్ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎలాంటి గొడవలు , అల్లర్లు జరగకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగా హీరోలంతా వస్తున్నారు..

khaidi-mydanam

ఇక పవన్ కళ్యాణ్ వస్తాడని అందరూ అనుకున్నప్పటికీ పవన్ రావడం లేదని పక్క సమాచారం అందింది..కొద్దీ సేపటి క్రితమే అన్నయ్య చిరంజీవి కి , చిత్ర యూనిట్ కు తన శుభాకాంక్షలను తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక పవన్ లేని ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూడాలి.