ట్రైలర్ టాక్ : కంగనా నగ్న శృంగారం

kangana

విశాల్ భరద్వాజ్ సినిమాలు వైవిధ్యంగా వుంటాయి. వాస్తవికత, భారీదనం, హృదయాన్ని కదలించే కధ, సంగీతం , సాహిత్యం.. ఇలా అన్నీ సమపాళ్ళలో రంగరించి చిత్రాలు నిర్మిస్తుంటారయన. ఇటీవలే ‘హైదర్’తో సంచలనం సృష్టించిన విశాల్ భరద్వాజ్ ఇప్పుడు రంగూన్ తో వస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ఓ ట్రైయాంగిల్ లవ్‌ స్టోరీ ఇది. షహీద్ కపూర్, కంగనా రనౌత్, సైఫ్ ఆలీఖాన్ ప్రాధాన పాత్రలు పోషించారు. తాజగా ఈ చిత్రం ట్రైలర్ బయటికి వచ్చింది. అద్భుతంగా వుంది ఈ ట్రైలర్.

మాంటిక్ డ్రామా ‘రంగూన్’ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రలో ఇందులో కనిపించింది. ఆమెను నటిగా తీర్చిదిద్దిన కబీర్ ఖన్నా ను ప్రేమిస్తుంది. ఈ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులకు ఇండియన్ నేషనల్ ఆర్మీ కి జరిగిన యుద్ధం దృశ్యంలో మన్వా షెర్గల్ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. వీరి మధ్య జరిగిన ‘ప్రేమ-యుద్ధం-కపటం”ఆమె రంగూన్ చిత్రం. ఈ ట్రైలర్ లో అడుగడుగునా విశాల్ భరద్వాజ్ మార్క్ కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు చాలా వున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి పరిస్థితులను చూపించారు. అన్నట్టు ట్రైలర్ లో ఘాటు ముద్దు సన్నీవేషాలు కూడా వున్నాయి. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.