ప్రీ రిలీజ్ కు చిరు ఎంట్రీ ఎలా ఉండబోతుంది తెలుసా..?

mini-ground-khaidi

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫంక్షన్ రానేవచ్చింది..చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీ గా ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో ఈ మూవీ ఫై మెగా అభిమానులలోనే కాక చిత్ర పరిశ్రమ లోని ఈ మూవీ ఫై భారీ గా ఆసక్తి నెలకొని ఉంది..దానికంటే ముందే చిరు అభిమానులను ప్రీ రిలీజ్ తో కలుసుకోబోతున్నాడు.

khaidi-new-poster

గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ఈ మెగా ఈవెంట్ రేపు అభిమానుల మధ్య గ్రాండ్ గా జరగబోతుంది. ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆ ఏర్పట్లను దగ్గర ఉండి, చూస్తున్నాడు. చాలా కాలం తరువాత చిరు ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం కావడంతో ఈవెంట్ జరిగే స్టేజి పైకి చిరు ఎంట్రీ ని వెరైటీ గా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

చిరు స్టేజి పైకి ఓ ఫ్లైయింగ్ సాసర్ నుంచి దిగేలా ప్లాన్ చేశారట. దాని కోసం స్టేజిని తగిన విధంగా సిద్ధం చేస్తున్నారట. చిరు ఫ్లైయింగ్ సాసర్ లో గాలిలో ఎగురుకుంటూ స్టేజి పై కి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. తాడుల సహాయంతో దించుతారా లేక ఏదైనా టెక్నాలజీని ఉపయోగిస్తారా చూడాలి.