దిల్ రాజు పెద్ద రిస్కే చేస్తున్నాడు

dilraju (4)

ఈ సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీసు వార్ కు రెండు పెద్ద సినిమాలు రెడీ అయాయ్యి. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా అయితే, బాల‌య్యకు ఇది వందో చిత్రం. ఈ ఇద్దరు ఒక రోజు గ్యాప్ లో అంటే బాల‌య్య 12న వ‌స్తుంటే, అంత‌కంటే ముందు 11న చిరు రంగంలోకి దిగిపోతున్నాడు.

అయితే ఇప్పుడీ పోటిలో దిల్ రాజు సినిమా కూడా లైన్ లోకి వచ్చింది . శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శతమానం భవతి’.. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఈ సినిమానీ సంక్రాంతి బరిలో బరిలోనే దించాలని డిసైడ్ అయిపోయాడు దిల్ రాజు. 14వ తేదీన ‘శతమానం భవతి’ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు.

సంక్రాంతి .. కుటుంబం – అనుబంధాల నేపథ్యంలో కొనసాగే పండుగ. అలాంటి కంటెంట్ తోనే ‘శతమానం భవతి’ వస్తోంది. సో.. ఈ సినిమాకి ఆ సీజన్ లో మంచి ఆదరణ లభిస్తుందని ఆయన భావిస్తున్నారట. పెద్ద సినిమాల ఎఫెక్ట్ ఈ ఈ సినిమా పై పడే చాన్సే లేదని ఆయన అనుకుంటున్నారట. రెండు పెద్ద సినిమాలతో తోడుగా వస్తున్న ఈ సినిమా భవిష్యత్ ఎలా ఉటుందో చూడాలి మరి.